TS PRC: పీఆర్‌సీకి తెలంగాణ
మంత్రివర్గం ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న
పీఆర్‌సీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శాసనసభలో గత మార్చి 22న ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రకటనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూన్ నుంచి పీఆర్‌సీ అమలు కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గ
సమావేశం ముగిసింది. దాదాపు 8.30 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో
మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
లాక్‌డౌన్ నిబంధనల సడలింపు
నిర్ణయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు, వ్యవసాయ భూముల డిజిటల్
సర్వేకు ఆమోదం తెలిపింది. మొదట 27 గ్రామాల్లో డిజిటల్ సర్వే చేయాలని మంత్రి వర్గం
నిర్ణయించింది. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో డిజిటల్ సర్వే
నిర్వహించనున్నారు. 9 జిల్లాల్లో 3 చొప్పున 27 గ్రామాల్లో డిజిటల్ సర్వే
కొనసాగుతుంది.
0 Komentar