TS: తెలంగాణలో 'లాక్‌డౌన్' పూర్తిగా ఎత్తివేత -
తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా
ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ
శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి
వచ్చిందని, వైద్యశాఖ
అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ
మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
లాక్‌డౌన్ సందర్భంగా విధించిన
అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్
ఆదేశించింది. అయితే, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇంకా ఎలాంటి
నిర్ణయమూ తీసుకోలేదు.
జూలై 1
నుంచి విద్యాసంస్థలు రీఓపెన్
జూలై 1
నుంచి పాఠశాలలు, కాలేజీలు పున ప్రారంభం కానున్నాయి. లాక్
డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరవాలని సర్కార్
నిర్ణయించింది. విద్యార్థుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే.. విద్యా సంస్థలను
తెరవనున్నారు. కరోనా నిబంధనలైన మాస్కులు, భౌతికదూరం పాటిస్తూ, విద్యార్థులు పాఠశాలలకు రావొచ్చు.
రేపట్నుంచి ఇవన్నీ ఓపెన్
తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తివేసిన
నేపథ్యంలో, రేపట్నుంచి అన్నీ ఓపెన్ చేయనున్నారు. ఆదివారం నుంచి
రాష్ట్రంలో పబ్బులు, సినిమా థియేటర్లు, బార్లు, పార్కులు, రెస్టారెంట్లు
పూర్తిస్థాయిలో తెరుచుకోనున్నాయి. అన్ని ఆఫీసులు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు
సాధించనున్నాయి. లాక్ డౌన్ తో ఇన్నాళ్లు సాయంత్రం 6 గంటల
వరకే ఓపెన్ ఉండేవి.
0 Komentar