TS Inter Exams: తెలంగాణలో
ఇంటర్ పరీక్షలు రద్దు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక
నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా పరిస్థితుల
నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం,
తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు
వెల్లడించాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్ భేటీలో చర్చ
జరిగింది. ఈ నేపథ్యంలో పరీక్షల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటర్
సెకండియర్ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక
ఇంటర్ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట
మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మళ్లీ కరోనా
వైరస్ విజృంభించే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది.
0 Komentar