TS: ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల
విడుదలకు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం
ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా
సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు
ప్రకటించింది. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు
ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35
శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో
ఏడాది 35 మార్కులను కేటాయించనున్నారు. ప్రైవేటుగా దరఖాస్తు
చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు
మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
జులై 1
నుంచి పాఠశాలల ప్రారంభంపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు:
విద్యాశాఖ
రాష్ట్రంలో జులై 1
నుంచి పాఠశాలల ప్రారంభంపై కోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్
సుల్తానియా తెలిపారు. విద్యార్థులు
కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ బోధన కూడా
కొనసాగుతుందని వివరించారు.
విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. దీంతో వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.
0 Komentar