Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: లాక్‌డౌన్‌ పొడిగింపు – కానీ స‌డ‌లింపు స‌మ‌యం పెంపు

 

TS:  లాక్‌డౌన్‌ పొడిగింపు – కానీ స‌డ‌లింపు స‌మ‌యం పెంపు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ పై చర్చించింది. లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడిలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న లాక్‌డౌన్‌ సడలింపును సాయంత్రం 5గంటల వరకు పొడిగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. 

 లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. దాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags