TS: ఇకపై వరంగల్, హన్మకొండ జిల్లాలు: సీఎం కేసీఆర్
వరంగల్ అర్బన్, గ్రామీణ
జిల్లాలకు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు
మార్చనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ
ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు
ఆయన శంకుస్థాపన చేశారు. హన్మకొండలో రూ.57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
‘‘ప్రజల పనులు వేగంగా జరిగితేనే
ప్రజాస్వామ్యానికి సార్థకం. ప్రజలు తమ పనుల కోసం పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి
ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్‌లు కూడా త్వరగా పూర్తి
కావాలి’’ అని కేసీఆర్ అన్నారు. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుందని
ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారని,
ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లేదని అందువల్ల వారి
పేరు మారిస్తే బాగుంటుందని అన్నారు.
0 Komentar