TS: నేటి నుంచి ఉపాధ్యాయులకు టీకాలు – ప్రభుత్వ, ప్రైవేట్
బోధనేతర సిబ్బందికి కూడా టీకాలు
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్
పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి గురువారం
(24వ తేదీ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కరోనా
టీకా వేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించడంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు
శ్రీదేవసేన బుధవారం డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో టీకాలు వేయనున్నారు.
జులై ఒకటో తేదీ నుంచి
విద్యాసంస్థలు తెరుచుకోనున్నందున వాటిల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ నెల 30వ
తేదీలోపు టీకా వేయించుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సీఆర్‌పీ/ ఉపాధ్యాయుడు
ఒకరు ఉంటారని, విద్యా సిబ్బంది తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు చూపించి టీకా వేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
0 Komentar