TS Vaccination: జులై 3 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్
తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్
ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం 30 ఏళ్లు పైబడిన వారికి
మాత్రమే ప్రభుత్వ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. జులై 3 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కొవిడ్ టీకా
వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 టీకా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో కలిపి మరో 204,
గ్రామీణ ప్రాంతాల వారికోసం 636 ప్రాథమిక
ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని వైద్యారోగ్యశాఖ
వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల వారు కొవిన్
పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నా లేక నేరుగా ప్రభుత్వ టీకా కేంద్రాలకు వచ్చినా
టీకా పొందవచ్చని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొవిన్ పోర్టల్‌లో
రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొన్నారు. కొవిషీల్డ్
మొదటి డోస్ తీసుకున్న వారికి 14 నుంచి 16 వారాల
మధ్య రెండో డోస్ ఇవ్వనున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.
0 Komentar