TSRJC CET-2021: టీఎస్ ఆర్‌జేసీ
సెట్ రద్దు -
జూన్ 7
లోపు మార్కులు అప్‌లోడ్ చేయాలని సూచన
తెలంగాణ సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీల ప్రవేశ పరీక్ష రద్దు అయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీఎస్ ఆర్‌జేసీ సెట్ 2021ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.
పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్‌లో ప్రవేశాలు చేపడుతామని తెలిపారు. జూన్ 7వ తేదీ లోపు మార్కులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. https://tswreis.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కరోనా తీవ్రత , విద్యార్ధులు భవిష్యత్తు దృష్ట్యా ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా ఈ ఒక్క సంవత్సరం ఎస్ఎస్‌సీ సీజీపీఏ ఆధారంగా అభ్యర్థి అప్లయ్ చేసినప్పుడు ఇచ్చిన కాలేజీ ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సీట్ కేటాయింపు జరుగుతుందన్నారు.
టీఎస్ డబ్ల్యూఆర్ జేసీసీఈటీ- 2021కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరూ జూన్ 2 నుంచి
జూన్ 7 తేదీల మధ్యలో వెబ్‌సైట్‌ను సందర్శించి, ఎస్ఎస్ సీలో పొందిన సబ్జెక్టు గ్రేడ్లను మరియు మొత్తం సీజీపీఏ వివరాలను
అప్‌లోడ్ చేయాలని సూచించారు. దీని ఆధారంగానే ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలు
కల్పిస్తారు.
0 Komentar