UIDAI Unveils Direct Link to Check Aadhaar-Bank Linking Status, Details Here
ఆధార్-బ్యాంక్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి
UIDAI
కొత్త డైరెక్ట్ లింక్ ఇదే
కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర
ప్రభుత్వం అందించే మరికొన్ని పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు బ్యాంకు
ఖాతాకు తప్పని సరిగా లింక్ అయ్యి ఉండాలి. ఈ తరుణంలో కొందరు లబ్ధిదారులు నగదు తమ
బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని వాపోతున్నారు. నగదు డిపాజిట్ కాకపోవడానికి ఆధార్
కార్డుతో బ్యాంకు ఖాతా లింక్ కాకపోవడం ఒక కారణం. అయితే బ్యాంకు ఖాతా ఆధార్‌తో
లింక్ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవడానికి యూనిక్ ఐడెండిఫికేషన్ అథారిటీ ఆఫ్
ఇండియా (యూఐడిఏఐ) ఒక లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఆధార్
కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవచ్చు. దీని కోసం ఏం
చేయాలంటే..
* ముందుగా మీ కంప్యూటర్
లేదా మొబైల్‌లో https://resident.uidai.gov.in/bank-mapper వెబ్‌సైట్‌కు
లాగిన్ అవ్వాలి.
* ఆధార్ కార్డ్ నెంబర్,
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న ‘సెండ్ ఓటీపీ’ మీద క్లిక్
చేయలి.
* ఆధార్ నెంబర్‌తో లింక్
అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపి వస్తుంది.
* ఓటీపీ నెంబర్‌ను నింపి
‘సబ్మిట్’ బటన్ నొక్కాలి. వెంటనే
వివరాలు తెరమీద ప్రత్యక్షమవుతాయి.
#UpdateMobileInAadhaar
— Aadhaar (@UIDAI) May 31, 2021
Do you want to check your Aadhaar Bank Linking Status? You can do it online if your mobile number is linked with your Aadhaar. Check your Aadhaar Bank Linking Status by clicking on this link https://t.co/3ctZxrlssQ #Aadhaar #AddMobileToAadhaar pic.twitter.com/UXexO01fXs
0 Komentar