Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Unique Disability ID card also allowed for getting Covid shot

 

Unique Disability ID card also allowed for getting Covid shot

కో-విన్ రిజిస్ట్రేషన్ కు దివ్యాంగుల గుర్తింపు కార్డే ఫోటో ఐడి: కేంద్ర ఆరోగ్య శాఖ 

వాక్సిన్ ప్ర‌క్రియ‌ను సరళతరం చేసేందుకు ,దానిని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో కొన‌సాగించేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం నిరంత‌ర కృషి చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు రాసిన లేఖ‌లో ప్ర‌త్యేక దివ్యాంగ గుర్తింపు (యుడిఐడి ) కార్డుల‌ను కోవిన్ 2.0 లో న‌మోదుకు ఫోటో గుర్తింపు కార్డుగా వినియోగించవచ్చని సూచించింది. 2021 మార్చి 2 న విడుద‌లైన కో-విన్ 2.0 కు మార్గ‌ద‌ర్శ‌కాల్లో ఆరు ఫోటో ఐడి కార్డుల‌ను సూచించారు. వాక్సినేష‌న్‌కు ముందు ప‌రిశీల‌న‌కోసం ఈ జాబితా ఇచ్చారు. 

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కుఆ రాసిన లేఖ‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇందుకు సంబంధించిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ, సామాజిక న్యాయం సాధికార‌త మంత్రిత్వ‌శాఖ‌, దివ్యాంగులకు సాధికార‌త క‌ల్పించే విభాగం వారికి జారీచేసిన యుడిఐడి కార్డుల‌లో అవ‌స‌ర‌మైన అన్ని వివ‌రాలు అంటే పేరు , పుట్టిన తేదీ, స్త్రీ లేదా పురుషుడు అన్న స‌మాచారం, ఆ వ్య‌క్తి ఫోటో వంటివ‌న్నీ ఉన్నాయ‌ని, కోవిడ్ -19 వాక్సినేష‌న్ కు అవ‌స‌ర‌మైన గుర్తింపున‌కు ఇవి ప‌నికివ‌స్తాయ‌న తెలిపారు. 

దివ్యాంగుల‌కు వాక్సినేష‌న్ అందుబాటులో ఉండేట్టు చేసేందుకు కోవిడ్ -19 వాక్సినేష‌న్‌కు నిర్దేశించిన గుర్తింపుకార్డుల జాబితాలో యుడిఐడిని చేర్చ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ప్రొవిజ‌న్ క‌ల్పిస్తున్నారు. దీనిని కోవిన్‌లో త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తారు.యుడిఐటి కార్డు ను కోవిడ్వాక్సిన్వేయించుకునేందుకుగుర్తింపుకార్డుగావినియోగించ‌వచ్చ‌న్న విష‌యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags