Voluntary Retirement Guidelines: వాలంటరీ రిటైర్మెంట్: సందేహాలు - సమాధానాలు
1. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే
ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి?
ఏయే పత్రాలు జతపర్చాలి?
జవాబు:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే
3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల
లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో
మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్
టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి
వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు
ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.
2. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై
తీసుకోవచ్చు?
జవాబు:
వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.
=================================
3. ప్రశ్న:
ఒక టీచరుకు అక్టోబర్ 2021 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్
తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?
జవాబు:
20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్
సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.
================================
4. ప్రశ్న:
ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?
జవాబు:
క్వాలిఫయింగ్ సర్వీస్ కు....
సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add
చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.
0 Komentar