We Are Not social media, New IT Rules
Not Applicable: Google Tells HC
గూగుల్: కొత్త
ఐటీ నిబంధనలు సెర్చింజన్‌కు వర్తించవు - గూగుల్ సోషల్ మీడియా కాదు
ఆన్‌లైన్ న్యూస్ పబ్లిషర్లకు వర్తించే కొత్త ఐటీ నిబంధనలు సెర్చింజన్‌కు వర్తించవని గూగుల్ నేడు దిల్లీ హైకోర్టుకు తెలిపింది. అంతేకాదు.. అభ్యంతరకర సమాచారాన్ని అన్‌లైన్ నుంచి తొలగించే విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనబెట్టాలని కోరింది.
కొందరు అభ్యంతరకర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఎక్కించారు, వీటిని వరల్డ్‌వైడ్ వెబ్ నుంచి తొలగించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించినప్పటికీ వాటి ఇతర వెబ్‌సైట్లలో కూడా రీ పోస్టింగ్‌లు చేస్తున్నారు. ఈ కేసు తీర్పులో భాగంగా సెర్చింజన్ కూడా ఆయా వెబ్‌సైట్లను తమ వేదికపైకి అనుమతించ కూడదని సింగల్ జడ్జి పేర్కొన్నారు. దీంతో గూగుల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లు కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫేస్బుక్, పోర్నోగ్రఫీ వెబ్‌సైట్, బాధిత మహిళకు నోటీసులు జారీ చేశారు. గూగుల్ పిటిషన్‌పై జులై 25లోపు సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలేదని న్యాయస్థానం తెలిపింది.
తమది కేవలం సెర్చింజన్ కేవలం
మాధ్యమం మాత్రమే అని.. అది సోషల్ మీడియా
మాధ్యమం కాదని గూగుల్ వాదిస్తోంది. ఒక వేళ సింగ్ జడ్జి తీర్పులు అమలు
చేయలేకపోయినా.. అమలు చేయడంలో విఫలమైనా చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కల్పించాలని
కోరింది. అంతేకాదు సింగల్ జడ్జి తీర్పులో తమని సోషల్ మీడియాగా పరిగణించిన
అంశాన్ని తొలగించాలని కోరింది.
0 Komentar