WhatsApp to soon get Disappearing Mode,
Multi-Device support and View Once feature
వాట్సప్‌లో కొత్తగా మూడు ఫీచర్స్
వస్తున్నాయి - ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటన
వాట్సప్‌లో మూడు కొత్త ఫీచర్స్
వస్తున్నాయని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. వాట్సప్‌లో
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వస్తుంటాయి. ఇప్పుడు మరో మూడు ఫీచర్స్ వస్తాయి.
ఇందులో డిసప్పియరింగ్ మెసేజెస్, వ్యూ వన్స్, మల్టీ
డివైజ్ లాంటి ఫీచర్స్ వస్తున్నాయి
1. Multi-Device Support for Up to 4
Devices
మల్టీ డివైజ్ సపోర్ట్. చాలా కాలంగా
ఈ ఫీచర్ గురించి వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్నారు. ఈ ఫీచర్‌ను వాట్సప్
చాలాకాలంగా పరీక్షిస్తోంది. బీటా వర్షన్ రెండు నెలల్లో వస్తుంది. 4 డివైజ్ ల వరకు వాడొచ్చు.
2. ‘View Once’ Feature
ఇక దీంతో పాటు వ్యూ వన్స్ అనే
ఫీచర్ కూడా తీసుకొస్తోంది వాట్సప్. మీరు ఎవరైనా ఏదైనా మెసేజ్, ఫోటో,
వీడియో పంపారంటే వాళ్లు ఒక్కసారే చూడొచ్చు. ఒకసారి చూసిన తర్వాత ఆ
మెసేజ్, ఫోటో, వీడియో డిలిట్
అయిపోతుంది. అయితే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
3. Disappearing Messages Feature
వాట్సప్ గతేడాది డిసప్పియరింగ్
మెసేజెస్ ఫీచర్‌ను గతేడాది రిలీజ్ చేసింది. ఛాట్‌లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్
చేసే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ఏదైనా ఛాట్‌లో ఆన్ చేస్తే వారం రోజుల మెసేజెస్ తప్ప
అంతకుముందువి కనిపించవు.
ఇప్పుడు ఇదే ఫీచర్‌ను అన్ని ఛాట్‌లకు
ఆన్ చేసేలా రూపొందిస్తోంది వాట్సప్. అంటే మీరు అన్ని ఛాట్స్‌లో ఈ ఫీచర్
ఉఫయోగించాలంటే డిసప్పియరింగ్ మోడ్ ఫీచర్ ఆన్ చేసుకోవచ్చు.
0 Komentar