సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గడం, ఫిట్‌నెస్, కాళ్లు, మనసుకు ఎందుకు మంచిది
Every year, World bicycle day is observed on June 3. The date of June 3 was declared as World Bicycle Day by the United Nations General Assembly after it acknowledged the versatility, uniqueness and longevity of the two-wheeler.
ప్రస్తుతం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంటికే పరిమితమైపోయారు. ఇలాంటి టైమ్‌లో ఏ ఎక్సర్‌సైజ్ చేయడం లేదు. అలాంటి వారు సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి..
సైకిల్ తొక్కితే ఇన్ని లాభాలా.. అస్సలు
మిస్ అవ్వొద్దు..
సైక్లింగ్ సరదాగా ఉంటుంది, పైగా మంచి వ్యాయామం కూడా. చిన్నప్పుడు అందరూ సైకిల్ తొక్కే ఉంటారు కానీ, పెద్దైపోయి బరువు బాధ్యతలు మీద పడ్డాక పక్కకి పెట్టేసిన జ్ఞాపకాల్లో సైకిల్ కూడా చేరిపోయింది. కానీ, మళ్ళీ సైకిల్ విహారం చేయడానికి ఇది బాగా అనువైన సమయం, మీరు ఏళ్ళ తరబడి సైకిల్ తొక్కకపోయినా ఏం పరవాలేదు. ప్రస్తుతం చాలా మందిమి వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉన్నాం. దాంతో, మనందరికీ చేతిలో కొంత సమయం ఉంటోంది. దాన్నిలా సద్వినియోగం చేద్దాం. అయితే, ఇక్కడ చెప్పిన విషయాలు ఒక్కసారి గమనిస్తే ఈ ఎక్స్పీరియెన్స్ ఇంకా బాగుంటుంది.
1. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుందని గుర్తు పెట్టుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటూ సైక్లింగ్ వల్ల ఒత్తిడి తగ్గి బాగా ఫోకస్ చేయగలుగుతారు. నిజానికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా మెంటల్ హెల్త్ కి కూడా తోడ్పడుతుంది. సైక్లింగ్ కూడా అలాంటిదే.
2. సుమారైన స్పీడ్ లో రోజుకి ముప్ఫై నిమిషాలు సైక్లింగ్ చేస్తే మీరనుకున్న ఫిట్నెస్ లెవెల్ కి రీచ్ అవ్వగలుగుతారని నిపుణులు అంటున్నారు.
3. ఎక్కువ సేపు లాప్టాప్ ముందు కూర్చుని పని చేయడం వల్ల స్లీప్ సైకిల్ బాగా దెబ్బ తింటోంది. ఈ ప్రాబ్లమ్ కి సైక్లింగ్ మంచి సొల్యూషన్. రోజులో మీ ఆఫీస్ వర్క్ అయిపోయిన తరువాత లాప్‌ట్యాప్ క్లోజ్ చేసి సైకిల్ బైటికి తీసి ఒక్క అరగంట అలా తిరిగి వస్తే బాగా ఉత్సాహంగా ఉంటుంది, అలసట ఉంటుంది కానీ అది హాయైన అలసట. పైగా చక్కటి ఆకలి కూడా వేస్తుంది.
4. హై గేర్ లో ఎక్కువ సేపు
పెడల్ చేయకండి. ఎందుకంటే, అది మీ మోకాళ్ళ మీద స్ట్రెస్
పెంచుతుంది. సైక్లింగ్ సరదాగా ఉండాలి, ఫిట్నెస్ గోల్స్ కూడా
రీచ్ అవ్వాలి, కానీ పనిష్మెంట్ లా ఉండకూడదు కదా.
5. హెడ్ ఫోన్స్ పెట్టుకుని సైక్లింగ్ చేయకండి. వెనుక నుండి వచ్చే వెహికిల్స్ యొక్క హార్న్స్ మీకు వినబడాలి. లేదా, ట్రాఫిక్ లో ఏం జరుగుతోందో మీకు తెలియాలి.
6. సైకిలే అయినా సరే, హెల్మెట్ పెట్టుకునే సైక్లింగ్ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే, మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి.
7. మీకు కళ్ళ జోడు అవసరం ఉంటే ఎలాగా పెట్టుకుంటారు. కానీ, కళ్ళజోడు అవసరం లేకపోయినా సరే, సైక్లింగ్ కి వెళ్ళేముందు ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకోండి. దీని వల్ల దుమ్మూ, ధూళీ కళ్ళల్లో పడకుండా ఉంటాయి.
8. ఈ ఎక్సర్సైజ్ కి పెద్ద పరికరాలేమీ అక్కర్లేదు. ఒక సైకిల్, హెల్మెట్ మీ దగ్గిరుండాలి, సేఫ్ రోడ్ లో మీరు ప్రయాణించాలి, అంతే. మీ కార్డియో వాస్క్యులర్ హెల్త్ బాగుండాలి అని మీరనుకుంటే మాత్రం సైక్లింగ్ మంచి ఆప్షన్.
9. నెమ్మదిగా మొదలుపెట్టండి, మొదటి రోజే ఎక్కువ సమయం స్పెండ్ చేయకండి. మీ శరీరాన్ని ప్రేమించండి. మీ కాళ్ళు నెమ్మదిగా పెడలింగ్ కి అలవాటు పడాలి. ఆ తరువాత అతి కొద్ది సమయం లోనే మీరు మంచి ఆరోగ్యాన్నీ, పాజిటివ్ మైండ్ సెట్ నీ గమనిస్తారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar