7th Pay Commission: Centre hikes DA for Central
Govt Employees to 28%
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
పెంపు
- ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పెంపుదల వర్తింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్త. కరవు భత్యం (డీఏ) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.
డీఏ పెంపు వల్ల రూ.34,401 కోట్ల మేర ఖజానాపై భారం పడనుందని మంత్రి వివరించారు. కేబినెట్ నిర్ణయం వల్ల 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో 2020 జనవరి 1, 2021 జులై 1, 2021 జనవరి 1న చెల్లించాల్సిన డీఏలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆగిపోయిన కాలానికి ఎలాంటి ఎరియర్స్ చెల్లించడం లేదని కేంద్రం స్పష్టంచేసింది.
త్వరలో పశువుల కోసం అంబులెన్సులు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే,
ఆయుష్ మిషన్ కార్యకలాపాలను 2026 వరకు
పొడిగిస్తున్నామని, ఆయుష్ మిషన్‌కు రూ.4,607 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
0 Komentar