కొవిడ్-19 హోం కిట్‌ను ఆవిష్కరించిన అబోట్ - వివరాలు ఇవే
ఎవరికివారు ఇంటి దగ్గరే కరోనా పరీక్ష చేసుకునేలా కొవిడ్-19 హోం కిట్‌ను ప్రముఖ ఆరోగ్య పరికరాల సంస్థ అబోట్ లేబొరేటరీస్ ఆవిష్కరించింది. లక్షణాలున్నా, లేకున్నా... పెద్దలు, చిన్నారులు దీని ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్ష నిర్వహించుకోవచ్చని ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ పాన్‌బయో కొవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను అందుబాటులోకి తెస్తున్నాం. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కిట్ ఖరీదు రూ.325. నాలుగు కిట్ల ప్యాకెట్ రూ.1250, 10 కిట్లదైతే 2,800, 20 కిట్లది 5,400 ఉంటుంది.
ఈ నెలాఖరు నాటికి 70 లక్షల కిట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని అబోట్ పేర్కొంది.
‘‘కొవిడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కీలక
భూమిక పోషిస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లు, కార్యాలయాలు,
ల్యాబొరేటరీల వద్ద పరీక్షలు నిర్వహించుకునేలా కిట్లను అందుబాటులోకి
తెచ్చాం’’ అని ఆసియా-పసిఫిక్‌లో అబోట్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ బిజినెస్
విభాగ ఉపాధ్యక్షుడు సంజీవ్ జోహర్ తెలిపారు.
0 Komentar