AP
Covid-19 Media Bulletin 20-07-2021
ఏపీలో
కొత్తగా 2,498 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
24 గంటల వ్యవధిలో రాష్ట్ర
వ్యాప్తంగా 88,149 పరీక్షలు నిర్వహించగా.. 2,498 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది ప్రాణాలు
కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,44,222 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా
ఇప్పటివరకు 2,37,52,356 నమూనాలను
ఆరోగ్య శాఖ పరీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,178కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,201 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,07,201కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,843 యాక్టివ్ కేసులున్నాయి.
0 Komentar