AP
Covid-19 Media Bulletin 25-07-2021
ఏపీలో
కొత్తగా 2,252 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో
కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 84,858 మంది నమూనాలు పరీక్షించగా 2,252 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు.
కరోనా నుంచి నిన్న 2,440 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో
ప్రస్తుతం 22,155 యాక్టివ్ కేసులు
ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో
నలుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో
ఇద్దరు, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం,
పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
0 Komentar