Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ ఆంక్షలు అమలు - Extension of Curfew in the State up to 21.07.2021

 

AP: అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ ఆంక్షలు అమలు - Extension of Curfew in the State up to 21.07.2021

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 21-07-2021 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. 

రాత్రి 9 గంటలకు దుకాణాలు మూతపడాలని.. నిబంధనలు పాటించని దుకాణాలను 2-3 రోజులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనపై ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించాలని స్పష్టం చేసింది. ఫొటోలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబరును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

మరోవైపు ప్రజలెవరూ గుమిగూడకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది. అందరూ మాస్కులు ధరించేలా చూడాలని మార్కెట్‌ కమిటీలను ఆదేశించింది. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

HM& FW Department – Extension of Curfew in the State up to 21.07.2021 to Contain the spread of Covid-19 - Orders – Issued.

G.O.Rt.No.371 Dated:14-07-2021.

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags