ఏపీలో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు
సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి
జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు
సడలింపులు ఉంటాయని తెలిపింది. సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసేయాలని
ఆదేశించింది.
వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష
నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిగతా జిల్లాల్లో ఉదయం 6
నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి. గోదావరి
జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు
మూసేయనున్నారు. ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు
వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.
0 Komentar