AP: రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వ
ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్
పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన
సమీక్షలో.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న
విషయం తెలిసిందే. ఈ మేరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది.
రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30
వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో
ఉంటుంది. జనసమూహాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం
చేసింది.
HM& FW Department – Extension of
Curfew in the State upto 30.07.2021 to contain the spread of Covid-19 - Orders
– Issued.
G.O.RT.No. 390 Dated: 21-07-2021
0 Komentar