AP POLYCET-2021 Admissions: Second Phase Counselling Schedule Details Here
ఏపీ పాలిసెట్-2021 - రెండవ విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే
UPDATE 13-11-2021
AP Polycet-2021 Admissions: Second Phase
Notification
నోటిఫికేషన్ షెడ్యూల్:
►నవంబర్ 12 నుండి 14
వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు కొరకు ఫీజు పే చేసుకోవచ్చు.
►నవంబర్ 13
నుంచి 15 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్.
►నవంబర్ 12 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం.
►నవంబర్ 18 న సీట్లు కేటాయింపు ఉంటుంది.
►నవంబర్ 18 నుంచి 22 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్
చేయాలి.
========================
UPDATE 12-10-2021
ప్రొవిజినల్ సీట్ల కేటాయింపు
జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఉమ్మడి
ప్రవేశ పరీక్ష ఏపీ పాలీసెట్ - 2021 కు సంబంధించిన ప్రొవిజినల్ సీట్ల
కేటాయింపు జాబితా విడుదలైంది. విద్యార్థులు సీట్ల కేటాయింపు జాబితాను ఏపీ పాలీసెట్
అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. సీటు వివరాలను చూడటానికి అభ్యర్థులు హాల్ టికెట్
నంబరు, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు, పుట్టిన
తేదీ, పాస్ వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. పాలీసెట్ 2021లో పొందిన మార్కులు, ర్యాంకు, ఆన్
లైన్ లో అభ్యర్థులు సీటుకు సంబంధించి ఇచ్చిన ప్రాధాన్యతను ఆధారంగా చేసుకొని
డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డీటీఈ) సీట్లను కేటాయించింది.
=========================
Update on 01-10-2021
పాలిటెక్నిక్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో 84 పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిడెడ్, ప్రైవేట్ పరిధిలో 173 పాలిటెక్నిక్ కళాశాలలో 53,423 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 వేల పైన సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకి 68,137 మంది పరీక్ష రాస్తే 64,187 మంది అర్హత సాధించారు.
నోటిఫికేషన్ షెడ్యూల్:
►అక్టోబర్ 1 నుండి 7 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు కొరకు ఫీజు పే చేసుకోవచ్చు.
►అక్టోబర్ 3
నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది.
►అక్టోబర్ మూడు
నుంచి ఎనిమిదో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కి అవకాశం కల్పించాం.
►అక్టోబర్ 9న
ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది.
►అక్టోబర్ 11న
సీట్లు కేటాయింపు ఉంటుంది.
►అక్టోబర్ 12
నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
►18వ
తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకి తరగతులు ప్రారంభం.
=========================
Update on 15-09-2021
ఏపీ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి గౌతమ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌కు మొదటిర్యాంకు సాధించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌లో కొత్త
కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కల్పిస్తున్నట్లు
వివరించారు.
Update on 04-09-2021
CIRCULAR
The Polytechnic common Entrance Test, POLYCET'2021 for admission into various Govt. / Aided / Private / II Shift Polytechnics in the state of Andhra Pradesh has conducted on 01-09-2021 (Wednesday). The final key for POLYCET -2021 has been placed in http://sbtetap.gov.in portal.
AP: POLYCET-2021 Examination Question Paper
Update on 02-09-2021
CIRCULAR
The common Entrance Test i.e
POLYCET-2021 for admission into various Govt./ Aided / Private / II Shift
Polytechnics in the State of Andhra Pradesh has conducted on 01-09-2021 (Wednesday).
The Preliminary key for POLYCET-2021 has placed on http://sbtetap.gov.in portal.
Any objections in this examination key may please be addressed through e-mail to jsa.apsbtet@gmail.com before 03-09-2021 by 05:00 PM.
AP:
POLYCET-2021 Examination Question Paper
Update on 25-08-2021
హాల్ టికెట్లు విడుదల తేదీ: 25-08-2021.
పరీక్ష తేదీ: 01-09-2021.
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రవేశ పరీక్ష పాలిసెట్-2021 షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్షను సెప్టెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పదో తరగతి ఉత్తీర్ణులై ఆసక్తి ఉన్న
విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఆగస్టు 13వ తేదీలోగా రూ.400 రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఇతర వివరాలకు వెబ్‌సైట్ http://sbtetap.gov.in
ను, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు https://polycetap.nic.in
ను వినియోగించుకోవాలని తెలిపారు.
పాలిసెట్ ప్రశ్నపత్రంలో మార్పులు
సెప్టెంబరు ఒకటో తేదీన జరగనున్న
పాలిసెట్ ప్రశ్నపత్రంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మార్పులు చేసినట్లు
ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ
తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాల్లకి జీఓ జారీచేశారన్నారు. గత ఏడాది
వరకు 120 మార్కులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో గణితం 60, ఫిజిక్స్ 30,
కెమిస్ట్రీకి 30 మార్కులుండేవని అన్నారు. ఈసారి అవే 120 మార్కులకు
గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30
మార్కులకు ప్రశ్నలు ఉంటాయన్నారు. గణితంలో 10 మార్కులు తగ్గి ఫిజిక్స్ లో 10
మార్కులు పెరిగాయన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి ప్రవేశ పరీక్షకు సిద్ధం
కావాలని ఆయన తెలిపారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు కొత్త
సిలబస్
పాలిటెక్నిక్ విద్యార్థులకు గత ఏడాది సి20 కరిక్యులమ్ కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. తొలి ఏడాది విద్యార్థులంతా రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తుండడంతో వారికి ఇంగ్లీషు కొత్త సిలబస్ కోర్సు మెటీరియల్ తయారు చేసే ప్రక్రియ ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26-07-2021.
దరఖాస్తుకు చివరి తేదీ: 13-08-2021
.
పరీక్ష తేదీ: 01-09-2021.
10వ తరగతి మార్కుల ఫలితాల
కోసం వేచిచూసే వారి కోసం మరియు ఫలితాలను ఇప్పటికే పొందినవారి కోసం వేర్వేరు దరఖాస్తు
ఫారం లు ఉన్నాయి. క్రింద చూపబడ్డ వెబ్సైట్ లోని ఇమేజ్ ని చూడగలరు.
0 Komentar