ఏపి: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు
ఉపాధ్యాయుల హాజరు – ప్రొసీడింగ్స్ మరియు ఇతర వివరాలు ఇవే
ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,
సిబ్బంది అందరూ గురువారం పాఠశాలలకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ
ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కర్ప్యూ , వేసవి సెలవుల తర్వాత మొదటిసారిగా ఉపాధ్యాయులు బడులకు హాజరుకానున్నారు.
ఉపాధ్యాయులు మొదటి రోజు ప్రవేశాలు, విద్యార్థుల వివరాల
నమోదుతో పాటు ఆన్ లైన్ తరగతులకు వాట్సప్ గ్రూపు, డిజిటల్
కంటెంట్ సిద్ధం చేసుకోవాలి.
* శుక్రవారం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత
పాఠశాలల ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు బడులకు వెళ్లాలి.
* పాఠశాలలోని పని ఆధారంగా ఎవరు ఏ
రోజు బడికి రావాలనే దాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారు.
* ఉన్నత పాఠశాలల్లో 50% సిబ్బంది
రోజూ హాజరు కావాలి. ఉపాధ్యాయులను అనుసరించి ప్రధానోపాధ్యాయులు నిర్ణయం
తీసుకుంటారు.
* పంచాయతీరాజ్, పురపాలక
విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలను శానిటైజ్ చేయించాలి.
* జులై 15 నుంచి ఆన్లైన్ తరగతులు
నిర్వహించేందుకు అడకమిక్ ప్రణాళికను రూపొందించాలి.
* 15 నుంచి రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ
మండలి (ఎన్‌సీఈఆర్టీ) వర్క్ షీట్లను సరఫరా చేస్తుంది. వీటిని విద్యార్థుల
తల్లిదండ్రులకు ఇచ్చి ఇళ్లకు పంపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను
బడులకు పిలవరాదు.
AP:
జూలై 1వ తేదీ నుంచి పాఠశాల పని విధివిధానాలపై పాఠశాల విద్యా శాఖ
ఉత్తర్వులు విడుదల
0 Komentar