Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

బేస్ లైన్ పరీక్ష, వారధి వర్క్ షీట్స్ మరియు FA-1 & FA-2 మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

 

బేస్ లైన్ పరీక్ష, వారధి వర్క్ షీట్స్  మరియు FA-1 & FA-2 మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు 

* బేస్ లైన్ పరీక్ష, వారధి వర్క్ షీట్స్  మరియు FA-1 & FA-2 మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు.. గౌరవ డైరెక్టర్ వారు , ఎస్.సి.ఇ.ఆర్.టి.వారు తేది 29.07.2021 న నిర్వహించిన వెబెక్స్ మీటింగ్ ద్వారా తెలియజేసిన విషయాలు

* రాష్ట్ర మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలలో బేస్ లైన్ పరీక్ష చక్కగా నిర్వహిస్తున్నందుకు ముందుగా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. 

* బేస్ లైన్ పరీక్ష జవాబు పత్రాలను విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని వాటిని వెంటనే మూల్యాంకనము చేయాలి.

* విద్యార్ధులు పొందిన మార్కులను సబ్జెక్టు వారీగా పాఠశాలలో ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి.

* సి.ఎస్.ఇ  పోర్టల్ త్వరలో ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ప్రతి విద్యార్ధి మార్కులు సి.ఎస్.ఇ సైట్ నందు నమోదు చేయాలి.

* బేస్ లైన్ పరీక్ష కొరకు ఉపాధ్యాయులు రూపొందించిన ప్రశ్నాపత్రాలను, పరీక్ష వ్రాస్తున్న సందర్భంగా విద్యార్ధులకు వారి తల్లిదండ్రులు తీసిన ఫొటోలు తప్పనిసరిగా సేకరించాలి.

* చక్కగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను, విద్యార్దుల పరీక్ష వ్రాస్తున్న ఫొటోలను, జవాబు పత్రాలు సమర్పిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోలను  సేవ్  చేయాలి. వాటి నుండి ఉత్తమమైన 5 ఫొటోస్ ఎస్.సి.ఇ.ఆర్.టి వారి మెయిల్ కు పంపించాలి.

* కొద్ది రోజులలో అన్ని మండలాలకు వారధి వర్క్ షీట్స్ సప్లై చేయబడతాయి. వాటిని వెంటనే ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు అందించాలి.

* ఆన్లైన్ లో సప్తగిరి ఛానల్ నందు బోధన ప్రారంభమైన పిదప మాత్రమే విద్యార్ధులకు వారధి వర్క్ షీట్స్ రోజు వారి అందించవలెను.

* 6 నుండి 9 తరగతుల విద్యార్ధులకు గత విద్యా సంవత్సరం అనగా 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన FA-1 మరియు FA-2 ల మార్కులను ఇంకా కొన్ని పాఠశాలల వారు సి.ఎస్.ఇ పోర్టల్ నందు పూర్తిగా నమోదు చేయలేదు. అలాంటి పాఠశాలలు వెంటనే వాటిని నమోదు చేయాలి.

Base Line Tests 2021-22 Proceedings

Model Base Line Tests Papers 2021-22    

Previous
Next Post »
0 Komentar

Google Tags