CBSE 10th, 12th Result 2021: Find
Your Roll Number - Details Here
సిబిఎస్‌ఈ ఫలితాలకు ముందు విద్యార్ధులకు రూల్ నంబర్లను కేటాయించిన బోర్డు – వివరాలు ఇవే
త్వరలో సీబీఎస్ఈ పది, 12వ తరగతి ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో విద్యార్థులు మార్కులు
తెలుసుకునేందుకు బోర్డు ఓ విధానాన్ని రూపొందించింది. కరోనా కారణంగా దేశంలో
సీబీఎస్ఈ పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే పదో తరగతికి సంబంధించి విద్యా
సంవత్సరం పొడవునా నిర్వహించిన పరీక్షల్లోని మార్కుల ఆధారంగా ఫలితాలను
వెల్లడించనుంది. ఇందులో భాగంగా 20 మార్కులను అంతర్గత
మార్కులుగా పరిగణించగా.. మిగిలిన 80 మార్కులను వివిధ
పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయించనంది.
మరోవైపు 12వ
తరగతి మార్కుల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై సుప్రీంలో
పిటిషన్ కూడా దాఖలైంది. దీంతో బోర్డు మార్కుల కేటాయింపుపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ ప్రతిపాదించిన మూల్యాంకన విధానానికి సుప్రీంకోర్టు ఆమోదం లభించింది. అయితే
విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా జులై 31లోపు ఫలితాలను విడుదల చేయాలని అత్యన్నత ధర్మాసనం సీబీఎస్ఈని ఆదేశించింది.
ఈమేరకు బోర్డు ఫలితాలపై కసరత్తు చేసింది. అయితే విద్యార్థులకు కనీసం అడ్మిట్ కార్డులు కూడా విడుదల చేయకముందే పరీక్షలు రద్దవడంతో వారికి రూల్ నంబర్లను కేటాయించాలని నిర్ణయించింది. వీటి ద్వారా పిల్లలు తమ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. తాజాగా వెబ్ సైట్ లో రూల్ నంబర్ ఫైండర్ అనే ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. పది, 12వ తరగతి విద్యార్థులు అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. వాటి ద్వారా బోర్డు ఒక రూల్ నంబర్‌ను కేటాయిస్తుంది. ఆ నంబరుతో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. మరోవైపు ఫలితాలతో సంతృప్తి చెందని 12వ తరగతి విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ పరీక్షలు (ప్రధాన సబ్జెక్టులు మాత్రమే) నిర్వహించనున్నారు.
Check Your Roll Number for Class 10 and
Class 12 👇👇👇
0 Komentar