CBSE Divides 2021-22 Academic Year into
Two Terms With 50 % Syllabus Each
సీబీఎస్ఈ: 2021-22 విద్యా సంవత్సరాన్ని 50% సిలబస్ తో రెండు భాగాలుగా విభజన
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతి
బోర్డు పరీక్షల కోసం కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) సోమవారం ప్రత్యేక
మదింపు విధానాన్ని ప్రకటించింది. అకాడమిక్ సెషన్‌ను రెండు భాగాలుగా విభజించి
పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తదనుగుణంగా సిలబస్‌ను
హేతుబద్ధీకరిస్తామని తెలిపింది.
అంతర్గత మదింపు, ప్రాజెక్టు
వర్కులు మరింత విశ్వసనీయంగా ఉండేలా చూస్తామని పేర్కొంది. సీబీఎస్‌ఈ డైరెక్టర్
(అకాడమిక్) జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా విధానం ప్రకారం.. టర్మ్-1 పరీక్షలను ఈ ఏడాది
నవంబరు-డిసెంబరులో, టర్మ్-2 పరీక్షలను
వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. టర్మ్-1
పరీక్షల్లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. ఒక్కో పరీక్ష నిడివి 90 నిమిషాలు.
సీబీఎస్‌ఈ నియమించిన ఎక్స్‌టర్నల్
సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకుల పర్యవేక్షణలో అవి జరుగుతాయి.
బోర్డు నిర్ణయించిన సెంటర్లలో టర్మ్-2 పరీక్షలను
నిర్వహిస్తారు. ఒక్కో పరీక్ష నిడివి రెండు గంటలు. ఇందులో బహుళ రూపాల్లో (వ్యాసరూప,
సంక్షిప్త సమాధాన..) ప్రశ్నలు ఇస్తారు. ఒకవేళ డిస్క్రిప్టివ్
విధానంలో నిర్వహణ సాధ్యం కాకపోతే.. టర్మ్-1 తరహాలో పరీక్షలు
జరుగుతాయి.
0 Komentar