Centre Announces OBC &, EWS Quota for
Graduate & Post-Graduate Medical Courses
వైద్య కోర్సుల్లో ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్
రిజర్వేషన్లు ఖరారు - వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ
వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఓబీసీ-27శాతం, ఈడబ్ల్యూఎస్-10 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రిజర్వేషన్లు యూజీ (ఎంబీబీఎస్, బీడీఎస్), పీజీ, దంత వైద్యవిద్య కోర్సులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇవి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జాతీయస్థాయి కోటా విభాగంలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా ఎంబీబీఎస్‌లో ప్రతి ఏడాది 1500 విద్యార్థులు, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా EWS విభాగంలో 550 ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీలో వెయ్యి మందికి అవకాశం లభిస్తుందని పేర్కొంది.
Our Government has taken a landmark decision for providing 27% reservation for OBCs and 10% reservation for Economically Weaker Section in the All India Quota Scheme for undergraduate and postgraduate medical/dental courses from the current academic year. https://t.co/gv2EygCZ7N
— Narendra Modi (@narendramodi) July 29, 2021
0 Komentar