Common Eligibility Test for Central Govt
Jobs From 2022
కేంద్ర ఉద్యోగాల భర్తీకి 2022లో ఉమ్మడి అర్హత పరీక్ష
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
కోసం 2022 ప్రథమార్థంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్)
నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ
సహాయమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఆయన మంగళవారమిక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల సివిల్
లిస్ట్-2021ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ అర్హత
పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్‌మెంట్
ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్
కమిషన్,
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్‌లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను
ఇక మీదట నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీయే నిర్వహించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్‌టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా(షార్ట్ లిస్ట్)
రూపొందిస్తుందని చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం
ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర
ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని జితేంద్రసింగ్ స్పష్టంచేశారు.
0 Komentar