డిగ్రీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు –
తెలుగు, ఇంగ్లిష్ బాషల్లో పక్కపక్కనే ముద్రణ
అక్టోబర్ లో మొదటి ఏడాది ప్రవేశాలు
డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు
ద్విభాష పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. అన్ని కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తెలుగు
మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిన
ప్రభుత్వం... ఈ రెండు భాషల్లోనూ పాఠ్యాంశాలు ఉండేలా కొత్తగా పుస్తకాలు
ముద్రిస్తోంది. ఇందుకు ఉన్నత విద్యామండలి డిగ్రీ అధ్యాపకులను నియమించనుంది.
మొదటి ఏడాదిలో సెమిస్టర్ 1, 2లకు
ప్రధాన సబ్జెక్టులైన భౌతిక, రసాయన, జీవ,
జంతు, ఆర్థిక, రాజనీతి
శాస్త్రాలు, గణితం, కామర్స్, చరిత్ర సబ్జెక్టులకు కొత్త పుస్తకాలు రానున్నాయి. ఇప్పటి వరకు పైవేటు
పబ్లిషర్స్ ముద్రించిన పుస్తకాలే మార్కెట్లో అందుబాటులో ఉండగా.. ఈ ఏడాది ఉన్నత
విద్యామండలి కూడా అందించనుంది. ఒకే పాఠాన్ని తెలుగు, ఆంగ్ల
భాషల్లో పక్కపక్కనే ముద్రించనుంది. ఆంగ్లం అర్థం కానివారు తెలుగులో చదువుకునేందుకు
వీలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు .
ఇంజినీరింగ్, ఫార్మసీల
ప్రవేశాల తర్వాతే డిగ్రీ ప్రవేశాలు
డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలను
అక్టోబరులో ఉన్నత విద్యా మండలి చేపట్టనుంది. ఇంటర్ తర్వాత విద్యార్థులు
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నందున వీటికి
తొలుత కౌన్సెలింగ్ పూర్తిచేసి, తర్వాత డిగ్రీ ప్రవేశాలు
చేపట్టాలని నిర్ణయించారు. దరఖాస్తు, సీట్ల కేటాయింపు
ఆన్లైన్లోనే ఉంటుంది. గతేడాది కొన్నిచోట్ల కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల తరఫున
దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈసారి ఫోన్లకు వషైం పాస్వర్డ్ వచ్చే
విధానాన్ని తీసుకొస్తున్నారు. దరఖాస్తు సమయంలో ఇచ్చిన సెల్‌ఫోను సంక్షిప్త సందేశం
వస్తుంది. దీని ఆధారంగా దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది.
అన్ని కళాశాలల్లో కలిపి డిగ్రీ
సీట్లు 4,24,937 ఉండగా.. గతేడాది 61.84 శాతం నిండాయి. అత్యధికంగా అనంతపురంలో
ఎక్కువ సీట్లు భర్తీ కాగా, పశ్చిమ గోదావరిలో అతి తక్కువగా చేరారు.
గతేడాది తెలుగు మాధ్యమంలో 25శాతం మంది చేరారు. ఈసారి 100 శాతం ఆంగ్ల మాధ్యమంలోనే
చేరాల్సి ఉంటుంది.
0 Komentar