Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Delhi to Nominate Doctors, Health Workers for Padma Awards: CM Kejriwal

 

Delhi to Nominate Doctors, Health Workers for Padma Awards: CM Kejriwal

ఈసారి ఫ్రంట్‌లైన్ క‌రోనా యోధులను ‘పద్మ’లతో గౌరవిద్దాం - దిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో నిలబడి పని చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను ఈసారి పద్మ పురస్కారాల కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. అర్హులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని దిల్లీ ప్రజలను కోరారు. అర్హులుగా భావించే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పేర్లను ఆగస్టు 15లోపు ప్రజలు padmaawards.delhi@gmail.com మెయిల్‌కు పంపవచ్చని సూచించారు. 

ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ప్రజల సూచనలను పరిశీలించి తుది జాబితాను ఖరారు చేసి కేంద్రానికి పంపుతుందన్నారు. కేంద్రానికి పంపేందుకు తుది గడువు సెప్టెంబర్‌ 15 కావడంతో.. ప్రజలు సిఫారసు చేసే వ్యక్తుల  పేర్లను ఆగస్టు 15లోపే పంపాలని విజ్ఞప్తి చేశారు.

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషిచేసిన వైద్య సిబ్బంది సేవలకు గుర్తుగా వారిని ఈ ఏడాది పద్మ పురస్కారాలతో గౌరవించాలనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా నుంచి ప్రజల్ని రక్షించే క్రమంలో ఎంతోమంది వైద్య సిబ్బంది వైరస్‌ బారినపడి  ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి సేవలకు యావత్‌ దేశం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు ఎంత మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కొన్ని రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా రేయింబవళ్లు పనిచేశారో తనకు తెలుసని కేజ్రీవాల్‌ గుర్తుచేసుకున్నారు. 

పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి

Previous
Next Post »
0 Komentar

Google Tags