EAPCET: No 25% Weightage Marks from
Inter in EAPCET
ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజ్
మార్కులు తొలగింపు
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ వెయిటేజ్ మార్కలు తొలగించారు. ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది. ఈ ఏడాది ఈఏపీసెట్ 100శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయం,
ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)-21ను
ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు
నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం
తెలిసిందే. ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం
జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో 'ఎం' అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను
ఈ ప్రవేశ పరీక్షద్వారా నిర్వహిస్తున్నందున 'ఎం' స్థానంలో 'పి' ని చేర్చి
ఈఏపీసెట్‌గా మార్పు చేశారు.
AP
EAPCET-2021 Notification Released – Apply Now - Details Here
0 Komentar