Education Ministry to Draft Bill to
Establish Higher Education Commission of India (HECI)
HECI: ఉన్నత విద్యా కమిషన్
ఏర్పాటుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన
దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థల స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్ (HECI) తీసుకొచ్చే దిశగా కేంద్రం కసరత్తు వేగవంతం చేసింది. ఈ బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత గతేడాది జులై 29న జాతీయ విద్యావిధానం -2020ని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యా సంస్థల రెగ్యులేషన్, అక్రిడిటేషన్, ఫండింగ్, అకడమిక్ స్టాండర్డ్స్ వంటి కీలక ప్రక్రియలను ఒకేచోటకు చేరుస్తూ భారత ఉన్నత విద్యా కమిషన్‌ను రూపొందించాలని జాతీయ విద్యా విధానం సూచించిందని ప్రధాన్ పేర్కొన్నారు.
ఉన్నత విద్య కోసం అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓ విద్యా మండలిని ఏర్పాటు చేయాలని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే వైద్య, న్యాయ విద్యకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఉన్నత విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థన్నింటినీ హెచ్‌ఈసీఐలో విలీనం చేయనున్నట్టు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్ కారే ఇదివరకే ప్రకటించారు. 2021 విద్యా సంవత్సరం నాటికే ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.
0 Komentar