ఉద్యోగుల సందేహాలు-సమాధానాలు (13-07-2021)
1. ప్రశ్న: SR లో సర్వీస్ వెరిఫికేషన్
ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??
జవాబు: మెమో: 8388, తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో
సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.
2. ప్రశ్న: నేను B.Sc, M.Ed చేశాను. 1995 లో SGT గా చేరాను. ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు. ఎందువల్ల??
జవాబు: మెమో:5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.Ed
కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.
3. ప్రశ్న: నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు
పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??
జవాబు: ఐటీ కి ఇద్దరు పిల్లల
ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.
4. ప్రశ్న: ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??
జవాబు: చేర్చకూడదు. అందరూ కలసి ఉండి
వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
5. ప్రశ్న: నా భార్య హౌస్ వైఫ్. ఆమె కుటుంబ నియంత్రణ
ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??
జవాబు: జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.
0 Komentar