Facebook: How to Restore a Post You've
Deleted
Facebook: ఎఫ్‌బీలో డిలీట్
చేసిన పోస్టులు తిరిగి రికవరీ చేసుకోండీ ఇలా
కొన్నిసార్లు ఫేస్‌బుక్ వాల్ లేదా గ్రూప్‌లోని పోస్ట్‌లను డిలీట్ చేయాలనుకుంటాం. కానీ ఎలా చేయాలో తెలీదు. మరికొన్నిసార్లు అనాలోచితంగానో, పొరపాటునో ఏదైనా ఒక పోస్టును డిలీట్ చేసేస్తుంటాం. కానీ అది ముఖ్యమైనదనిపిస్తే ఆ తర్వాత నిరాశకు గురవుతాం. అనవసరమైన పోస్టులను డిలీట్ చేయడం, అలా డిలీట్ చేసిన పోస్టుల్లో కావాల్సినవాటిని తిరిగి రికవరీ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
* ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌లో మీరు డిలీట్ చేసిన పోస్ట్‌ను 30 రోజుల్లోగా రికవరీ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా మొబైల్ యాప్‌లో మీ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో ప్రొఫైల్ ఫొటో కింద మూడు చుక్కలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి, కొంచెం కిందివరకూ చూసుకుంటూపోతే, యాక్టివిటీ లాగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మేనేజ్ యువర్ పోస్ట్స్ ఆప్షన్ ఉంటుంది.
* అందులో మీ ఫేస్‌బుక్
పోస్ట్‌లు కనిపిస్తాయి. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకునేదాన్ని సెలెక్ట్ చేసి,
కింద రీసైకిల్ బిన్/ ట్రాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ పోస్ట్
డిలీట్ అయిపోతుంది.
* ఆ పోస్ట్ తిరిగి మీ ఫేస్‌బుక్
వాల్‌పై కనిపించాలంటే యాక్టివిటీ లాగ్‌లో రీసైకిల్ బిన్/ట్రాష్‌పై క్లిక్
చేస్తే.. మీరు డిలీట్ చేసిన పోస్ట్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి, కిందనే ఉన్న రిస్టోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే, అది
మళ్లీ మీ ఫేస్‌బుక్ వాల్‌పై కనిపిస్తుంది. అలా మీరు డిలీట్ చేసిన పోస్ట్‌లను
రికవరీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నేరుగా న్యూస్‌ఫీడ్ నుంచి పోస్ట్ డిలీట్ చేస్తే
మాత్రం రికవరీ చేయడం సాధ్యపడదు.
* మీరు డిలీట్ చేసిన పోస్టులు పైన పేర్కొన్న విధానంలో రికవరీ సాధ్యపడకపోతే.. అందుకు మరికొన్ని మార్గాలున్నాయి. ఎవరో క్రియేట్ చేసిన పోస్టును మీ వాల్ నుంచి డిలీట్ చేస్తే, దాన్ని రికవరీ చేసేందుకు ఫేస్‌బుక్ సెర్చ్ ఫంక్షన్ లేదా కీవర్డ్స్‌తో గూగుల్ సెర్చ్‌లో ప్రయత్నించవచ్చు.
* అలానే మీ మెయిల్ నోటిఫికేషన్స్‌ని కూడా చెక్ చేయండి. మీరు ఫేస్‌బుక్‌లో చేసే ప్రతి పోస్ట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ మీ మెయిల్‌కి వస్తుంది. అలా మెయిల్‌లోని ఆ పోస్టు వివరాలతో కీవర్డ్‌ని ఫేస్‌బుక్ సెర్చ్‌లో ప్రయత్నించి రికవరీ చెయ్యొచ్చు. అలానే మీ ఫ్రెండ్స్ మెయిల్‌కి నోటిఫికేషన్ వచ్చినా, వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి, పైన పేర్కొన్న సెర్చ్ ఆప్షన్‌ల ద్వారా సదరు పోస్ట్‌ని రికవరీ చెయ్యొచ్చు.
* ఫేస్‌బుక్ మెసేంజర్‌లో ఇతరులతో జరిగిన సంభాషణను డిలీట్ చేస్తే, ఇక దాన్ని రికవరీ చేయడం సాధ్యపడదు. అయితే మీ వైపు నుంచి జరిగిన సంభాషణను మాత్రమే డిలీట్ చేస్తే, అవతలి వ్యక్తి టైం లైన్ నుంచి వాటిని తిరిగి పొందొచ్చు.
ఖాతా డిలీట్ చేస్తే?
ఒకవేళ మీ ఫేస్‌బుక్ ఖాతాను కూడా డిలీట్ చేసినా 30 రోజుల్లో రికవరీ చేసుకోవచ్చు. దీనికోసం మీ ఖాతా డిలీట్ చేసిన తర్వాత మొబైల్ యాప్‌లో ఫేస్‌బుక్ ఐడీతో లాగిన్ అయితే, మీకు క్యాన్సిల్ డిలీషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు.
0 Komentar