బంగారం కొనడానికి వెళ్లినపుడు గమనించాల్సిన
అంశాలు - హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి? - హాల్ మార్కింగ్ ని ఎలా
గుర్తించాలి?
ఎక్కడో ఎవరో ఒకరు అత్యాశకు పోయి, నమ్మి వచ్చిన వినియోగదారులను మోసం చేస్తారు. అది తెలియగానే అందరినీ అనుమానం తొలిచేస్తుంది... ఇలాంటి మోసాలు ఇంకెన్ని జరుగుతున్నాయో, ఇది బయటపడింది కానీ బయటపడనివి ఇంకెన్నో... అనుకుంటారు. అవసరానికి బంగారం కొనక తప్పదు. ఒక విలువైన వస్తువుని సంతోషంగా ఇంటికి తెచ్చు కోవాల్సిన సందర్భంలో... అపనమ్మకమూ మోసపోతున్నామేమోనన్న అసంతృప్తీ వేధిస్తే- ఏం బాగుంటుంది?
మనదేశంలో జరుగుతున్న బంగారు ఆభరణాల
క్రయవిక్రయాలూ వాటి నాణ్యతల విషయంలో ఒక ప్రామాణిక విధానం అంటూ లేకపోవడం వల్ల పలు
అవకతవకలు జరుగుతున్నాయన్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ దృష్టికి వచ్చింది. తరచూ
వార్తల్లో చోటుచేసుకుంటున్న మోసాల తాలూకు వార్తలూ దానికి తోడవడంతో బ్యూరో ఆఫ్
ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బంగారు, వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్‌ని
తప్పనిసరి చేసింది.
ఏమిటీ హాల్‌మార్కింగ్?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో
పనిచేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనే సంస్థ పలు విషయాల్లో ప్రమాణాలను
నిర్దేశిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తోంది. స్వర్ణకారులకూ బంగారం
వ్యాపారస్తులకూ లైసెన్సులు ఇచ్చే సంస్థ ఇదే. అలాగే ఆయా లోహాల స్వచ్ఛతా ప్రమాణాలను
నిర్దేశించడానికి తెచ్చిందే హాల్‌మార్క్ విధానం. హాల్‌మార్క్ అనేది ఒక అధికారిక
చిహ్నం. ఫలానా బంగారు లేదా వెండి వస్తువు స్వచ్ఛత బీఐఎస్ ప్రమాణాలకు లోబడి ఉందని
ఇచ్చే గుర్తింపు చిహ్నం. ఇప్పుడు దేశం మొత్తమ్మీద ఎక్కడ వెండి బంగారాలు కొన్నా ఆయా
వస్తువులమీద హాల్‌మార్క్ ముద్ర తప్పనిసరిగా ఉండాలి.
Gold:
బంగారు నగలపై హాల్ మార్కింగ్ ని ఎలా గుర్తించాలి?
బంగారం కొనడానికి వెళ్లినపుడు
ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు.
* షాపుకి బీఐఎస్ లైసెన్స్
ఉందా, హాల్‌మార్కింగ్ నగలు మాత్రమే అమ్ముతామని బోర్డు రాసి
పెట్టారా... అన్నది గమనించాలి. దుకాణదారు లైసెన్సును షాపులో ప్రదర్శించాలి. బీఐఎస్
వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన దుకాణాల లిస్టు ఉంటుంది. అక్కడైనా చెక్
చేసుకోవచ్చు. లైసెన్సులో చూపిన అడ్రసు, షాపు అడ్రసు ఒకటే
అయివుండాలి. హాల్‌మార్కింగ్ సెంటర్ల చిరునామాలూ బీఐఎస్ వెబ్‌సైట్‌లో ఉంటాయి.
కాబట్టి గుర్తింపు ఉన్న హాల్‌మార్కింగ్ కేంద్రంలోనే చేయించారా అన్నదీ
నిర్ధారించుకోవచ్చు.
* బీఐఎస్ హాల్‌మార్క్,
బంగారం స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ సెంటర్ కోడ్,
నగ తయారైన సంవత్సరం లేదా దుకాణం పేరు... ఇవన్నీ నగ లోపలి వైపున
ముద్రించి ఉంటాయి. వాటిని పది రెట్లు పెద్దగా చూపించే భూతద్దం దుకాణంలో ఉంటుంది.
అడిగి తీసుకుని చూసుకోవాలి. చెవి దుద్దులు, గాజులు లాంటి
జతగా ఉండే వస్తువులకు రెండిటికీ విడివిడిగా హాల్‌మార్క్ ఉండాలి. దేనిమీదైనా
అనుమానం వస్తే బీఐఎస్‌కి ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ,
‘బీఐఎస్ కేర్’ మొబైల్ ఆప్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.
0 Komentar