ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు - సమాధానాలు (19-07-2021)
1. ప్రశ్న:
నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు
మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం
లేదు. ఎందువల్ల??
జవాబు:
జీఓ.374 తేదీ:16.3.96
ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా
టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.
•••••••••
2. ప్రశ్న:
నేను, మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA
లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము. SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??
జవాబు:
SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే, వారే
SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.
•••••••••
3. ప్రశ్న:
PF ఋణం ఎంత ఇస్తారు?? తిరిగి ఎలా
చెల్లించాలి??
జవాబు:
PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్
లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణం కోసం,
స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు
పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం
ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం
లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.
•••••••••
4. ప్రశ్న:
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??
జవాబు:
జీఓ199, ఆర్థికశాఖ తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి.
•••••••••
5. ప్రశ్న:
సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజులలోపు
సమాధానం ఇవ్వాలి??
జవాబు:
30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి.
0 Komentar