ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (16-07-2021) (AP&TS)
1. ప్రశ్న:
చదువుకునే ఆడవారు ఆధార్, పాన్
కార్డ్ లను వారి యొక్క ఇంటి పేరుతో తీసుకున్న వాటిని వివాహమైన తర్వాత భర్త ఇంటి
పేరుతో తప్పనిసరిగా తీసుకోవాలా? పుట్టినింటి సర్ నేమ్ ను
కొనసాగించ వచ్చునా?
జవాబు:
ఆడవారి surname ఎప్పుడు కూడా వారి తండ్రిది మాత్రమే ఉంటుంది. పెళ్ళితర్వాత భర్తది వస్తుంది కదా అనుకుంటారు... అలా రాదు. వారి పిల్లలకు మాత్రమే వస్తుంది. సో..ఆధార్ లో అయినా, PAN లో అయినా పేరు సర్టిఫికెట్ ప్రకారమే ఉండాలి. అవసరం అయితే ఆధార్ లో W/o అని భర్త పూర్తి పేరు పెట్టుకోండి. తప్ప మీ ఇంటిపేరు ఎట్టి పరిస్థితుల్లో మార్చకండి. ఉద్యోగ నియామక అప్లికేషన్ చేసిన తరువాత వెరిఫికేషన్ సమయంలో ఇబ్బంది ఎదురుకుంటారు.
2. ప్రశ్న:
పి.ఆర్.సీ బిల్లులు IFMIS సైట్ లో ఒక్కొక్కరికి చేయాలా? లేక అందరివి ఒకేసారి
చేయాలా? ఇంక్రిమెంట్ తేదీ 1st నుంచి
చూపించవలెనా? లేకపోతే అపాయింట్ మెంట్ తేది చూపించవలెనా?
జవాబు:
పి.ఆర్.సీ బిల్స్ ఒక్కొక్కరివి చేస్తేనే మంచిది. సైట్ నందు కూడా ఇండివిడ్యువల్ గా వస్తుంది. ఇకపోతే ఇంక్రిమెంట్ తేదీ మీరు నియామకమైన నెల యొక్క మొదటి తేదీనే చూపించవలసి ఉంటుంది. AAS తీసుకున్న (6, 12, 18, 24) యెడల వాటిని మాత్రమే అపాయింట్మెంట్ తేదీ నుంచి చూపించవలెను.
3. ప్రశ్న:
*SB లో GIS మరియు TSGLI కు సంబదించిన ఎంట్రీ ప్రతి సం|| వుండాలా లేక వాటి పెరుగుదల జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ చేయాలా? దయచేసి తెలుపగలరు.
జవాబు:
GIS ప్రతి సంవత్సరం Nov - నుండి Oct వరకు SB లో Entry చేయాలి. అలాగే TSGLI పెరిగినప్పుడు మార్పులు ఎప్పటినుండి వస్తే అప్పటిది ఎంట్రీ చేస్తే సరిపోతుంది.
4. ప్రశ్న:
2018 డిసెంబర్ లో AGI
మరియు 6 years AAS ఉన్న ఒక టీచర్ డిసెంబర్ 20,2018 నుండి ... మే 2019 వరకు మెటర్నిటీ లీవ్ లో ఉంది 30
th may 2019 స్కూల్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత టీచర్ కు 1st
డిసెంబర్ నుండి AGI ని, మరియు
28th డిసెంబర్ 2018 నుండి 6
year AAS ఇంక్రిమెంట్లు
ఇస్తూ.. మానిటరీ బెనిఫిట్స్ మాత్రం 30 మే 2019 నుండి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2020 PRC లో 6
YEARS AAS ఇంక్రిమెంట్ ను ఎప్పటినుండి ఎంట్రీ చెయ్యాలో చెప్పండి.?
జవాబు:
Sir Online December 2018
ఉంటుంది. Already దానినే ఎంట్రీ చేసి ఉంటాం. కానీ arrears
Bills లో అన్ని నోషనల్ కదా. Due drawn మాత్రమే
ఎడిట్ చేసి actual గా తీసుకుంది entry చేయవచ్చు.
Proceedings as for 6 years and AGI కూడా actual date వేస్తాం (అంటే December 2018). May లో join అయ్యారని మే 2019 ఇవ్వకూడదు. Table లో arrears edit చేసుకోవచ్చును.
0 Komentar