ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (26-07-2021)
1. ప్రశ్న:
నామినేషన్ ఏ ఏ సందర్భాలలో చెల్లదు?
సమాధానం:
(1) నామినేషన్ ఇచ్చే
సందర్భంలో ఉద్యోగికి ఫ్యామిలీ లేకపోతే ఎవరినైనా నామినీగా 'పేర్కొన్న
సందర్భంలో తరువాత అతనికి ఫ్యామిలీ ఏర్పడితే కొత్తగా ఫ్యామిలీ మెంబర్ చేరితే
అప్పుడు అతని నామినేషను రద్దు అవుతుంది.
(2) ఉద్యోగి తన మొదటి
నామినేషన్ రద్దు చేయాలని నోటీసు పంపితే నోటీసు అధికారికి అందిన రోజునుండి మొదటి
నామినేషన్ రద్దు అయి అతను సమర్పించిన కొత్త నామినేషన్ అమలులోకి వస్తుంది లేక
నామినీ చనిపోతే కూడా, నామినేషన్ రద్దు అవుతుంది.
--------------------------------------------------------------------------
2. ప్రశ్న:
ప్రభుత్వ ఉద్యోగికి ఫ్యామిలి వుంటే, తన ఫ్యామిలి మెంబర్స్ కాకుండా ఇతరులకు రిటైర్‌మెంట్ గ్రాట్యూటీ చెల్లించుటకు నామినేషన్ ఇవ్వవచ్చా?
సమాధానం:
ఇవ్వరాదు. ఫ్యామిలీ లేకుండా ఉంటే
ఇతరులను నామినేషన్ ఇవ్వవచ్చు. ఉద్యోగి ఒకరికంటే ఎక్కువ మందిని నామినేషన్‌గా
తెలుపవచ్చు. అయితే ఎవరెవరికి ఎంత "షేరు చెల్లించాలని నామినేషన్‌లో తెలపాలి.
--------------------------------------------------------------------------
3. ప్రశ్న:
ఉద్యోగి బ్రతికి వుండగా ఎటువంటి నామినేషన్ సమర్పించకుండా మరణిస్తే ఏంచేయాలి?
సమాధానం:
పెన్షన్ మంజూరు అధికారి, అతని
చివర తెలిపిన చిరునామాకు ఉత్తరం వ్రాసి అతని వారసులకు తగిన పత్రాలు సమర్పించాలని
తెలపాలి. అంతే కాకుండా వాటిని ఎలా నింపాలి ఎలా సమర్పించాలి అని కూడా తెలియజేయాలి.
GM.No. 046454-C/656/PSC-1/82/Fin& Plg. (FW. PSC) Dept, dt. 2-12-1982.
0 Komentar