ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు (27-07-2021)
1. ప్రశ్న:
Entire సర్వీస్ లో డిపార్ట్మెంట్ test compulsory pass కావాలా? Pass కాకపోతే తీవ్రమైన నష్టం ఉంటుందా? ఆర్ధిక పరంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పరంగా పెన్షన్ పరంగా తెలుపగలరు.
జవాబు:
ఇది కొంత మేర ఆర్థిక ప్రయోజనం పై
ప్రభావం చూపుతుంది...
ఒక SGT 24 సం. ల స్కేల్,
SA/LFL HM 12 సం. ల స్కేల్ పొందాలంటే EO, GO ఉత్తీర్ణత
తప్పనిసరి. లేకుంటే ఎప్పుడు పాస్ అయితే అప్పటి నుండే మోనిటరీ బెనిఫిట్ ఇస్తారు.
ఉదాహరణకు ఒక SGT 2018 నాటికి 24 సం. ల సర్వీస్ పూర్తి చేశారు. కానీ 2021 జులై సెషన్ డిపార్టుమెంటల్ పరీక్ష ఉత్తీర్ణత పొందారు. అప్పుడు వారికి 2018 నుండి కాక 2021 లో ఉత్తీర్ణత పొందిన పరీక్ష ఆఖరి
తేదీ నుండి వస్తుంది.
అనగా 2.5 సం. లు బెనిఫిట్ లాస్ అవుతుంది.
2. ప్రశ్న:
మా స్కూల్ టీచర్స్ పి.ఆర్.సీ ఎరియర్ బిల్స్ సబ్మిషన్ చేశాము. అయితే స్టేటస్ లో అవైటింగ్ గవర్నమెంట్ అప్రూవల్ అని వస్తుంది. కానీ IFMIS లో పే వివరాలు కనిపించడం లేదు. ఎందుకని?
జవాబు:
PRC ఎరియర్ బిల్స్ DTO/STO లో పాస్ కాగానే కొత్త బేసిక్ పే వెంటనే అప్ డేట్ కావడం లేదు. బిల్ పాస్ అయ్యాకా ఒకటి, రెండు రోజుల్లో అప్ డేట్ అవుతున్నాయి. ఆటోమేటిక్ గా అవి అప్ డేట్ అయిన తరువాత మాత్రమే జులై నెల కొత్త జీతం బిల్ చేయాల్సి వుంటుంది. జులై నెల బిల్ సబ్మిట్ చేయడానికి ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది.
3. ప్రశ్న:
SGT క్యాడర్ లో 24 సంవత్సరాల స్కేల్ తీసుకుంటే SA క్యాడర్ లో 6,12 సంవత్సరాల స్కేల్స్ తీసుకోవచ్చా?
జవాబు:
తీసుకొనరాదు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే రిటైర్మెంట్ అయ్యాక ఆడిట్ లో చెక్ చేసేటప్పుడు పెన్షన్ లో కోత పెడతారు. పెన్షన్ త్వరగా మంజూరు కాదు. ఇబ్బంది పడతారు.
4. ప్రశ్న:
గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాము పని చేసే కార్యాలయమునకు ఎంత దూరం లోపు నివాసం ఉండాలి అనేదానికి సంబంధిత GO ఏమన్నా ఉంటే తెలుపగలరు.
జవాబు:
GOMS number 20/8-2-2021 ప్రకారం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి వారు పనిచేస్తున్న హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా నివాసం ఉండాలని మెమో ఇవ్వడం జరిగింది. కనుక ఇంతదూరం, అంత దూరం అనే సంశయము వద్దు.
-------------------
5. ప్రశ్న:
కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ కి కావలసిన అర్హతలు ఏమిటో ఎవరైనా తెలియజేయగలరు.
జవాబు:
డిగ్రీ మరియు టైపింగ్ హయ్యర్
సర్టిఫికేట్. అలాగే Amendment was issued Degree along with" must have
knowledge to use computer with associated software like M.S.Office
etc"G.O.133 GAD 12.5.2014.
0 Komentar