Govt Slashes Prices of Pulse Oximeter
and Other Medical Devices
పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్
వంటి 5 రకాల వైద్య పరికరాల ధరలు భారీగా తగ్గింపు
కొవిడ్ బాధితుల చికిత్సలో కీలకంగా
మారిన పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్ వంటి 5
రకాల వైద్య పరికరాల ధరలు 88 శాతం వరకు తగ్గాయని రసాయనాలు,
ఎరువుల శాఖ తెలిపింది. కొవిడ్ బాధితుల శ్వాస, చక్కెర శాతం, రక్తపోటు, జ్వరం
పరీక్షించేందుకు ఉపయోగించే పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్,
బీపీ మానిటర్, డిజిటల్ థర్మామీటర్‌తో పాటు
శ్వాస సంబంధ ససమ్యలు పరిష్కరించేందుకు వినియోగించే నెబ్యులైజర్ ధరలు కూడా
గణనీయంగా పెంచి విక్రయించారు.
వీటిని అందరికీ అందుబాటులోకి
తెచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠంగా 70
శాతానికి పరిమితం చేస్తూ, నేషనల్ ఫార్మాస్యూటికల్స్
ప్రైసింగ్ అథారిటీ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈనెల 20
నుంచి ఈ వైద్య పరికరాల ధరలు దిగొచ్చినట్లు పేర్కొంది. 2021, జులై
23 నాటికి 684 బ్రాండ్ల వైద్య పరికరాలు
నమోదు కాగా.. 620 (91 శాతం) పరికరాల ఎంఆర్‌పీ ధరలను ఆయా
సంస్థలు సవరించాయి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌కు అందించే ధర, ఎంఆర్‌పీ మధ్య 709 శాతం వరకు వ్యత్యాసం ఉంది. దీన్ని
10 రెట్లకు పైగా తగ్గించారు.
0 Komentar