Guidelines for Conducting, Evaluation of Baseline Examination and Uploading of Marks (July 27th to August 10th)
రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4వ తేది నుండి 10వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు👇
సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు:
ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.
తరగతి ఉపాధ్యాయులకు సూచనలు:
తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.
విద్యార్థులను దత్తత తీసుకున్న
ఉపాధ్యాయులకు సూచనలు:
ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన
విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27
నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల
ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను.
ఆ విద్యార్థులకు సంబంధించి
ప్రశ్నాపత్రాలను "కీ" ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత
తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.
0 Komentar