IBPS Exam Process to Be Stopped for Now,
Says Ministry Amid Language Row
ఐబిపిఎస్ క్లర్క్-2021 దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
కామన్ రిక్రూట్ మెంట్
ప్రాసెస్(సీఆర్‌పీ) ద్వారా బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ విడుదల
చేసిన నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఐబీపీఎస్
తాజాగా దేశంలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 5,830 క్లర్క్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా
పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలనే డిమాండ్ ఉంది.
ముఖ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
సిద్ధారామయ్య కన్నడలోనూ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆర్థిక
శాఖమంత్రి నిర్మలా సీతారామనను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నిర్మల కర్ణాటక నుంచే
రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆమె కేంద్రంలో మంత్రిగా
ఉండి కూడా కన్నడలో ఉద్యోగ పరీక్షలను నిర్వహించేందుకు కృషి చేయడం లేదని
విమర్శించారు. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ దరఖాస్తుల ప్రక్రియను తాత్కాలికంగా
నిలివేయాలని ఆదేశించింది. అలాగే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణకు సంబంధించి ఓ
కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో తన నివేదికను
సమర్పించనుంది. అప్పటివరకు క్లర్క్ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోనుంది.
అలాగే దరఖాస్తు ప్రక్రియ తాత్కాలిక నిలిపివేతతో ముఖ్యమైన తేదీల్లో మార్పులు చేసుకోనున్నాయి. మరోవైపు ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలనే అంశంపై దృష్టి సారించిన ఆర్థిక శాఖ అందుకు ఆమోదం తెలిపితే ఉద్యోగాలకు పోటీ పెరగనుంది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనే ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రాంతీయ భాషల్లో రాసే వీలు కల్పిస్తే చాలామంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
IBPS
Recruitment 2021: ఐబీపీఎస్ - సీఆర్‌పీ XI 5830 క్లర్క్ పోస్టులు
0 Komentar