IBPS Recruitment 2021- CRP CLERKS-XI – Check the Prelims Results and Download Mains Admit Cards
ఐబీపీఎస్ - సీఆర్‌పీ XI 7855 క్లర్క్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే
UPDATE 15-01-2022
MAINS EXAMS ADMIT CARDS UPDATE
CLICK
HERE FOR MAIN ADMIT CARDS
====================
PRELIMS RESULTS UPDATE
CLICK
HERE FOR PRELIMS RESULTS
====================
UPDATE 06-10-2021
జులైలో విడుదల చేసిన 5830 7855 క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న
ప్రారంభమవుతుందని బ్యాంకు సిబ్బంది ఎంపిక సంస్థ (ఇన్నిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్
పర్సనెల్ సెలక్షన్-ఐబీపీఎస్) ప్రకటించింది.
ప్రాంతీయ భాషల్లో ఉద్యోగ పరీక్షలు
నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనల మేరకు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక కమిటీని కేంద్ర
ఆర్థికశాఖ నియమించింది. ఆ నివేదిక వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ఐబీపీఎస్ కు
అప్పట్లో సూచించింది. ఇటీవల కమిటీ చేసిన సిఫారసుల ఫలితంగా ఇంగ్లిష్, హిందీ
సహా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు జరపాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ఇకపై 12
ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్కుల భర్తీకి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ జరుగుతాయి. భవిష్యత్తులో స్టేట్
బ్యాంకు జరిపే పరీక్షలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. గ్రామీణ బ్యాంకుల పరీక్షలు
ఇప్పటికే స్థానిక భాషల్లో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో క్లర్కు ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను ఐబీపీఎస్ ఖరారు చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 7న మొదలై అక్టోబరు 27తో ముగుస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబరు 2021లోనూ, మెయిన్స్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి, 2022లోనూ జరుగుతాయి. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
NOTIFICATION AND DETAILS GIVEN BELOW 👇👇👇
=======================
UPDATE 14-07-2021
ఐబిపిఎస్
క్లర్క్-2021 దరఖాస్తుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత
UPDATE 12-07-2021
NOTIFICATION DETAILS
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్
పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ
బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
క్లరికల్ కేడర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 5830 7855
1. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీలు:
263 387
2. తెలంగాణలో ఖాళీలు: 263 333
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు:
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్
ఓవర్సీస్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్
ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్
తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్
నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల
ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు,
ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు
ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్
ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
* ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ లో ప్రశ్నలు
అడుగుతారు.
* పరీక్ష సమయం 60 నిమిషాలు.
* మెయిన్స్ పరీక్ష 200
మార్కులకు ఉంటుంది.
* జనరల్ అవేర్‌నెస్,
జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
లో ప్రశ్నలు వస్తాయి.
* సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు.
* ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 12.07.2021, 07.10.2021 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 01.08.2021, 27.10.2021
ప్రిలిమినరీ పరీక్ష తేది: డిసెంబర్, 2021
మెయిన్ పరీక్ష తేది: జనవరి/ఫిబ్రవరి, 2022
0 Komentar