Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IGNOU: 2021-22 విద్యా సంవత్సరానికి ఇగ్నో కొత్త కోర్సులు - దూర విద్య ద్వారా సర్టిఫికేట్లు

 

IGNOU: 2021-22 విద్యా సంవత్సరానికి ఇగ్నో కొత్త కోర్సులు - దూర విద్య ద్వారా సర్టిఫికేట్లు

 

ప్రస్తుతం 2021-22 సెషన్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటు నిపుణుల కోసం అనేక కోర్సులను ప్రారంభించింది. వైవిధ్యం, సృజనాత్మకతతో అందించే ఇగ్నో నూతన కోర్సుల సమగ్ర జాబితా వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి అనేక సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది. ఏటా ఈ విశ్వవిద్యాలయం స్వల్పకాలిక డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతుంది. ఈ కోర్సులను ఓపెన్ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలు, ఆన్ లైన్ డిస్టెన్స్ మోడ్ లో అందిస్తున్నాయి. ప్రస్తుతం 2021-22 సెషన్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో పాటు నిపుణుల కోసం అనేక కోర్సులను ప్రారంభించింది. వైవిధ్యం, సృజనాత్మకతతో అందించే ఇగ్నో నూతన కోర్సుల సమగ్ర జాబితా వివరాలు ఇప్పుడు చూద్దాం. 

1. MA జ్యోతిష్ (MAJY)

జ్యోతిషశాస్త్రంలో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రోగ్రాంను ఇగ్నో హ్యుమనిటీస్ స్కూల్ ప్రవేశపెట్టింది. కోర్సు గరిష్ఠ వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సును హింది, సంస్కృతంలో అందిస్తోంది. ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ ప్రోగ్రాంలో 40 క్రెడిట్ల పొందిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాసర్టిఫికేట్ పొందే అవకాశముంది. కోర్సు ఫీజుగా ఏడాదికి రూ.6300. మొత్తం కోర్సు ఫీజు రూ.12,600లుగా నిర్దేశించింది. 

2. MA డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ (MADP)

స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్(సోప్వా) రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (డ్రాయింగ్ అండ్ పెయింటింగ్) ప్రోగ్రాంను అందిస్తోంది. కోర్సు గరిష్ఠ వ్యవధి 4 సంవత్సరాలు. కోర్సుకు అర్హత సాధించాలంటే విద్యార్థులు ఆర్ట్స్ ఇన్ డ్రాయిండ్ అండ్ పెయింటింగ్/ ఫైన్ ఆర్ట్స్/ విజువల్ ఆర్ట్స్/ యానిమేషన్/ డిజైన్ లేదా ఫ్యాషన్ లేదా టెక్నాలజీ లేదా టెక్స్ టైల్ లేదా ఏదైనా అనబంధ సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. కోర్సు ఫీజు రూ.16,000లుగా నిర్దేశించింది. 

3. MA ఉర్దూ (MUD)

రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఉర్దూ(MUD) కోర్సు గరిష్ఠ వ్యవధి నాలుగేళ్లు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్నవారు దీనికి అర్హులు. ఈ కోర్సుకు ప్రతి ఏడాది రుసుం రూ.6,300. మొత్తం కోర్సు ఫీజు రూ.12,600లుగా ఉంది. 

4. MA ప్లోక్లోర్ అండ్ కల్చర్ స్టడీస్ (MAFCS)

ఇంటర్ డిసిప్లినరీ, ట్రాన్స్ డిసిప్లినరీ స్టడీస్ స్కూల్లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఫోక్లోర్ అండ్ కల్చర్ స్టడీస్ ప్రోగ్రాం) కోర్సును ఇగ్నో అందిస్తోంది. కోర్సుకు మొత్తం ఫీజు రూ.10,800లుగా నిర్దేశించింది. 

5. MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ (MSCENV)

ఇంటర్ డిసిప్లీనరీ అండ్ ట్రాన్స్ డిసిప్లీనరీ స్టడీస్ స్కూల్ రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎన్విరాన్మెంట్ సైన్స్) కార్యక్రమాన్ని అందిస్తోంది. బీఎస్సీ డిగ్రీ చదివిన వారు అర్హులు. కోర్సు ఫీజు ఏడాదికి రూ.7,500. మొత్తం కోర్సు ఫీజు రూ.15,000లుగా నిర్దేశించింది. 

6. పీజీ డిప్లొమా ఇన్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ (పీజీడీడీసీ)

డెవలప్మెంట్ కమ్యునికేషన్ లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును యూనివర్సిటీలోని జర్నలిజం విభాగం అందిస్తోంది. కోర్సుకు ఏడాది ఫీజు రూ.5,000లుగా ఉంది. 

7. పీజీ డిప్లొమాఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (పీజీడీసీఎస్ఆర్)

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఒక ఏడాది వ్యవధితో అందుబాటులో ఉంది. ఈ కోర్సును ఇంగ్లీష్ లో అందిస్తోంది. కోర్సు ఫీజు రూ.7,000. 

8. బీఏ (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) హిందుస్థానీ మ్యూజిక్ హాన్స్

మూడేళ్ల బ్యాచిలర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రోగ్రాంను స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ కోర్సును అందిస్తుంది. ఈ కోర్సు గరిష్ఠ వ్యవధి 6 సంవత్సరాలు. మొత్తం కోర్సు ఫీజు రూ.27,600. 

9. జెండర్, అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధిలో సర్టిఫికేట్(సీజీఏఎస్)

జెండర్, అగ్రికల్చర్, సుస్థిర అభివృద్ధిలో ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు కోసం ఇగ్నో దరఖాస్తును ఆహ్వానించింది. కోర్సు వ్యవధి గరిష్ఠంగా రెండు సంవత్సరాలు. కోర్సు ఫీజు రూ.3,800. 

10. సంస్కృత సంభాషణ్ సర్టిఫికేట్ (SSB)

సంస్కృతంలో ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సు గరిష్ఠ వ్యవధి 2 ఏళ్లు. కోర్సు ఫీజు రూ.1500. 

11. డిప్లొమా ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్

వాల్యూ ఎడ్యుకేషన్ లో ఓ ఏడాది డిప్లొమాకోర్సును స్కూల్ ఆఫ్ ఎక్సెటెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ అందిస్తోంది. కోర్సు గరిష్ఠ వ్యవధి 3 సంవత్సరాలు. కోర్సు ఫీజు రూ.4,000. 

12. డిప్లొమాఇన్ థియేటర్ ఆర్ట్స్ (DTH)

థియేటర్ ఆర్ట్స్ లో ఓ ఏడాది డిప్లొమా కోర్సును స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్ అందిస్తోంది. కోర్సు వ్యవధి గరిష్ఠ వ్యవధి 3 సంవత్సరాలు. కోర్సు ఫీజు రూ.7000.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags