Implementation of 10% EWS Reservation
for Job Posts and Educational Institutes Admissions
ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా - విద్యాసంస్థల
ప్రవేశాల్లోనూ అమలు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా
సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్) కు 10 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం
అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ వేర్వేరుగా ఉత్తర్వులు
జారీ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం రిజర్వేషన్లలో గతంలో
కాపులకు 5 శాతం, ఇతరులకు 5 శాతం కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు
మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను వర్తింపజేస్తూ బీసీ సంక్షేమశాఖ 2019 జులై 27న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల
స్ఫూర్తినే ఉద్యోగ నియామకాలకూ వర్తింపజేస్తూ ప్రభుత్వం తాజా జీవోను విడుదల
చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలుకు ఇచ్చిన మార్గదర్శకాలే.. అంటే ఏ రకమైన రిజర్వేషన్ల కోటాలోకి రాని, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించారు.
★ఎస్సీ, ఎస్టీ,
బీసీ రిజర్వేషన్ల కేటగిరీలో రాకుండా ఏడాది రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
★ అయిదెకరాలు, అంతకంటే
ఎక్కువ వ్యవసాయం భూమి ఉండకూడదు.
★ వెయ్యి చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ నివాస ఫ్లాటు ఉండకూడదు.
★పురపాలక, నగరపాలక సంస్థల్లో 100 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ నివాస స్థలం ఉండకూడదు.
★ నగర, పురపాలక పరిధిలో
లేని ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే
ఎక్కువ స్థలం ఉంటే అర్హులు కారు.
★ రిజర్వేషన్ పొందడం కోసం తహసీల్దారు జారీ
చేసే ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
విద్యా సంస్థల్లోనూ ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా
గతంలో బీసీ సంక్షేమ శాఖ 2019-20లో విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు జారీ
చేసింది. తాజాగా ప్రభుత్వం ఈ సంవత్సరంతోపాటు రాబోయే విద్యా సంవత్సరానికీ దీన్ని
వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
GAD – Implementation of 10% Reservation
to the Economically Weaker Sections for admissions into Educational
Institutions– Orders – Issued.
G.O.MS.No. 65 Dated: 14-07-2021.
General Administration Department -
Implementation of 10% Reservation to the Economically Weaker Sections (EWS) for
initial appointments in the Posts and Services under the State Government -
Orders – Issued.
G.O.MS.No. 66 Dated: 14-07-2021
0 Komentar