Indian Researchers Spot Rare Super
Luminous Supernova Illuminating with Borrowed Energy Source
విశ్వంలో అరుదైన సూపర్ నోవా - శక్తిని అరువు తెచ్చుకొని మరీ వెలుగుతోంది – వివరాలు ఇవే
విశ్వంలో చాలా ప్రకాశవంతమైన, వేగంగా
మార్పు చెందుతున్న ఒక సూపర్ నోవాను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది
పూర్తిగా స్వయంప్రకాశితం కాదని తేల్చారు. పొరుగునున్న శక్తిమంతమైన అయస్కాంత
క్షేత్రం కలిగిన ఓ న్యూట్రాన్ నక్షత్రం నుంచి శక్తిని 'అరువు
తెచ్చుకొని ఇది వెలుగులీనుతోంది. ఇది అత్యంత అరుదైన 'సూపర్
లూమినస్ సూపర్‌వా'. ఇలాంటి పురాతన ఖగోళ వస్తువుల సాయంతో
తొలినాటి విశ్వానికి సంబంధించి కొత్త వివరాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు
పేర్కొన్నారు.
విశ్వంలో జరిగే అత్యంత శక్తిమంతమైన
విస్పోటాల్లో సూపర్‌వాలు కూడా ఒకటి. ఒక భారీ నక్షత్రంలో ఇంధనం నిండుకున్నప్పుడు
ఇవి సంభవిస్తాయి. వీటిలో 'సూపర్ లూమినస్ సూపర్ నోవా' చాలా ప్రత్యేకం. సూర్యుడి కన్నా కనీసం 25 రెట్లు
శక్తిమంతంగా ఉండే భారీ నక్షత్రాల నుంచే ఇది వెలువడుతుంది. తాజాగా గుర్తించిన సూపర్
లూమినస్ సూపర్‌నోవాకు 'ఎస్ఎన్ 2020
ఏఎన్ కే’ (SN 2020ank) అని పేరు పెట్టారు. దీనిపై నైనిటాల్
లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు
క్షుణ్నంగా పరిశోధన జరిపారు. ఈ సూపర్ నోవాలోని వెలుపలి భాగం.. ఉల్లిపొరలా
తొలగిపోయిందని గుర్తించారు. కోర్ భాగం మాత్రం అరువు తెచ్చుకున్న కాంతితో
వెలుగులీనుతోందని గుర్తించారు.
0 Komentar