India’s first ‘Grain ATM’ set up in
Gurugram
దేశంలోనే తొలిసారిగా రేషన్ సరుకుల ఏటీఎం
- గురుగ్రామ్‌లో ఏర్పాటు
ఏటీఎంల ద్వారా ఖాతాలోని నగదు
తీసుకోవడం గురించి అందరికీ తెలుసు. కానీ, అలాంటి ఏటీఎంల ద్వారా
రేషన్ సరుకులు వస్తే.. చౌక ధరల దుకాణాల ముందు బారులు తీరాల్సిన అవసరం ఉండదు కదా!
అలాంటి ప్రయత్నమే చేపట్టింది హరియాణా ప్రభుత్వం.
దేశంలోనే తొలి ‘రేషన్ ఏటీఎం’ను
గురుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం నుంచి 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. ఇందులో
బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. టచ్‌స్క్రీన్ ద్వారా లబ్ధిదారుడు ఆధార్ లేదా
రేషన్ ఖాతా నెంబర్ పొందుపరచాలి.
బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, వారికి
ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమేటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. వీటి
ఏర్పాటుతో రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెర
పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని ఆ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా చెప్పారు.
India's first Grain ATM set up in #Gurugram under the ‘World Food Programme’ of @UN.
— Rajiv Kumar 🇮🇳 (@RajivKumar1) July 15, 2021
A revolutionary initiative taken by Haryana DCM @Dchautala that will ensure transparency & accuracy in the state's public food distribution system. pic.twitter.com/2ySaau2551
0 Komentar