Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Instant messaging app 'Sandesh' now available on Play Store and App Stores

 

Instant messaging app 'Sandesh' now available on Play Store and App Stores

Sandes APP: దేశీయ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ సందేశ్‌ ఇక  ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్లలో లభ్యం

దేశీయ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ సందేశ్‌ ఎట్టకేలకు ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ యాప్‌ బీటా వెర్షన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి ఇతర ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసింది. గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టమ్‌ (జిమ్స్‌)ను అప్‌గ్రేడ్ చేసి సందేశ్‌ యాప్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో పాటు వ్యక్తిగత వినియోగదారులకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 

* ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగానే సందేశ్‌ యాప్‌లో చాట్ లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపవచ్చు. మల్టీమీడియా కంటెంట్‌తో పాటు కాంటాక్ట్స్ షేరింగ్ ఆప్షన్‌ కూడా చెయ్యొచ్చు. యాప్‌తోపాటు వెబ్‌ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్‌ వెబ్‌ పోర్టల్‌ ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. ఆందులో మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ ఐడీ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఫోన్‌ లేదా ఈ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే సందేశ్‌ వెబ్ ఓపెన్ అవుతుంది.  

* ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఓటీపీ వెరిఫేకేషన్ జరుగుతుంది. తర్వాత మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ని సింక్‌ చేయాలా ..వద్దా అని అడుగుతుంది. సింక్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరెవరు సందేశ్ యాప్‌ ఉపయోగిస్తున్నారనేది చూపిస్తుంది. ఒకవేళ కాంటాక్ట్ లిస్ట్‌ సింక్‌ చెయ్యకపోతే మీరు యాప్ ఉపయోగిస్తున్నారనే విషయం ఇతరులకు తెలియదు. 

* గతంలో ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీతో మాత్రమే ఖాతా తెరవాలనే నిబంధనను ప్రస్తుతం సవరించారు. ఈ-మెయిల్‌ ఐడీతో సంబంధం లేకుండా యాప్‌లో ఖాతా తెరవచ్చు. యూజర్ భద్రత కోసం ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇచ్చారు. అయితే ఈ యాప్‌లో తొలుత ఆడియో/వీడియో కాల్స్ ఫీచర్‌ ఇచ్చినప్పటికీ తాజా అప్‌డేట్‌లో వాటిని తొలగించడంతో యూజర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వెబ్‌ వెర్షన్ కూడా సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆడియో/వీడియో కాల్స్ ఫీచర్‌ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.

DOWNLOAD (ANDROID)

DOWNLOAD (i-Phone)

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags