iOS 15: How to Copy and Paste Text from
Photos
iPhone: ఐఓఎస్15 కొత్త
ఫీచర్ - ఫోటోల మీద ఉండే టెక్ట్స్‌ని కాపీ & పేస్ట్ ఫీచర్
ఐఫోన్ లో ఉండే ఫీచర్స్ ఎలా ఉంటాయో
అందరికీ తెలిసిందే. యాపిల్ కూడా తన యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని
పరిచయం చేస్తోంది. తాజాగా ఫోటోల మీద ఉండే టెక్ట్స్‌ని కాపీ చేసి పేస్ట్ చేసుకునే
ఫీచర్‌ను తీసుకొస్తోంది. త్వరలో విడుదలకానున్న ఐఫోన్ 15
ఓఎస్‌లో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది.
అయితే, ఇప్పటికే యాపిల్ ఐఫోన్ 15 బీటా వెర్షన్‌ని విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ పూర్తిగా కొత్తది కావడం, ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉండటంవల్ల దీన్ని ఉపయోగించాలనుకునేవారికి ఇందులో బగ్స్ ఉంటాయని, కొన్ని యాప్స్ కూడా సరిగా పనిచేయవని యాపిల్ వెల్లడించింది. అయితే యూజర్స్ మాత్రం లైవ్ టెక్ట్స్ లాంటి కొత్త ఫీచర్ల అనుభూతిని పొందుతారని తెలిపింది. యాపిల్ తీసుకొస్తున్న లైవ్ టెక్ట్స్ ఫీచర్ ద్వారా యూజర్స్ ఐఫోన్‌లోని ఫొటోలపై ఉండే టెక్ట్స్‌ని కాపీ చేసి పేస్ట్ చెయ్యొచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
*
మీ ఐఫోన్‌లో ఫొటోస్ యాప్ ఓపెన్ చేసి అందులో టెక్ట్స్‌తో ఉన్న
ఫొటోను ఎంచుకోండి.
*
తర్వాత ఫొటోలోని పదాల మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్
ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ క్లిక్ చేస్తే తర్వాత కాపీ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత
మీరు దాన్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు.
*
ఉదాహరణకు మీరు కాపీ చేసింది హోటల్ లేదా లొకేషన్ పేరయితే
దాన్ని గూగుల్‌లో పేస్టే చేసి సెర్చ్ చెయ్యొచ్చు. లేదంటే టెక్ట్స్ పాడ్‌లో పేస్ట్
చేసి సేవ్ చేసుకోవచ్చు.
*
ఒకవేళ టెక్ట్స్ మరీ చిన్నదిగా ఉంటే జూమ్ చేసి చూసుకునే
వెసులుబాటు కూడా ఉంది.
0 Komentar